ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో హిందూపురం పట్టణంలో బెట్టింగ్లకు పాల్పడుతున్నారని హిందూపురం రెండో పట్టణ పోలీసులకు సమాచారం వచ్చింది. విస్తృత తనిఖీలు నిర్వహించి ఐదు మంది క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 70 వేల నగదు 5 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్సీ మహబూబ్ బాషా వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం