అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని నేడు ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్‌లు ప్రారంభించారు. కరోనా కాలంలో ఆస్పత్రులలో పడకల కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో సహకారం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు, అన్ని పార్టీలు కలిసి రావడం అభినందనీయమన్నారు. కరోనా రెండో దశలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి