ETV Bharat / state

వీసీలా! రాజకీయ నాయకులా? - యూనివర్సిటీలను జగన్ భ్రష్టు పట్టించారు : సీపీఐ రామకృష్ణ - YSR statue at Sri Krishnadevaraya University

CPI Ramakrishna on Universities in AP: జగన్ సీఎం అయ్యాక విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురం ఎస్​కే వర్సిటీలో అధికార వైసీపీ నేతలు ఆక్రమించిన ఐదెకరాల భూమిని, విద్యార్థి సంఘాలు వ్యతిరేస్తున్నా బలవంతంగా ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. జగన్ నియమించిన వీసీలు దిగజారిపోయి రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

CPI_Ramakrishna_on_Universities_in_AP
CPI_Ramakrishna_on_Universities_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:14 PM IST

CPI Ramakrishna on Universities in AP: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లా ఎస్​కే యూనివర్సిటీలో అధికార వైసీపీ నేతల ఆక్రమణకు గురవుతున్న ఐదెకరాల భూమిని, అదే విధంగా విద్యార్థి సంఘాలు వ్యతిరేస్తున్నా బలవంతంగా వర్సిటీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.

CPI Ramakrishna on Universities in AP: రాజకీయ నేతల్లా వీసీలు - యూనివర్సిటీలను జగన్ భ్రష్టు పట్టించారు: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Fires on CM Jagan: జగన్ మోహన్ రెడ్డి నియమించిన వీసీలు యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. పోలీసు బందోబస్తు మధ్య అర్దరాత్రి వేళ విగ్రహాన్ని పెట్టించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవటంలేదని ఆరోపించారు. ఎస్కేయూలో తనతో పాటు చదువుకున్న అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి అధికార పార్టీలో ఉన్నారని, యూనివర్సిటీ భ్రష్టుపట్టిపోతున్నా పట్టించుకోరా అంటూ వారిని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపితే తప్ప యూనివర్సిటీలు బాగుపడవని రామకృష్ణ అన్నారు.

పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు

YSR Statue in SKU: నవంబర్ 22వ తేదీన అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎస్కేయూ ఆవరణలో వైఎస్ విగ్రహాన్నిఏర్పాటు చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే యూనివర్సిటీ వీసీ రామకృష్ణారెడ్డి ఆందోళనల నడుమ విగ్రహావిష్కరణ చేయించగా ఈ రోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు.

YCP Leaders try to Encroach SKU Land: ఎస్కేయూలో వివాదాలు కేవలం ఇవి మాత్రమే కాదు. కొద్ది రోజు క్రితం ఎస్కే యూనివర్సిటీ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రికి రాత్రే కంచె సైతం ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చెపట్టడంతో కంచెను తొలగించారు. రాష్ట్రంలో యూనివర్సిటీలు వైసీపీ పాలనలో రాజకీయాలకు అడ్డాలుగా మారాయని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏకంగా యూనివర్శిటీ భూములకే ఎసలు పెట్టారు - ఎస్కేయూలో 150 ఎకరాల కబ్జాకు వైసీపీ నేతల పన్నాగం

CPI Ramakrishna Comments on Jagan: ఎన్నికల ముందు వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్​ను అనంతపురం సర్వజనాసుపత్రిలో రామకృష్ణ పరామర్శించారు. ఉద్యోగులు, టీచర్లు తమ డిమాండ్ల సాధనకు ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిందేనని ఆయన అన్నారు.

ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి టీచర్లను మోసం చేశారన్నారు. ఉద్యోగులను మోసం చేసిన జగన్ నాలుగు నెలల్లో ఇంటికిపోతున్నారని, టీచర్లు, ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన అన్నారు. ప్రభుత్వం మారుతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

యూనివర్సిటీ వీసీల స్వామి భక్తి - విద్య కంటే వైసీపీ వీరవిధేయతకే ప్రాధాన్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.