కొత్త పంచాయతీ రాజ్ ఆర్డినెన్సు చట్టం ఎన్నికలలో పోటీ చేసే వారిని భయ బ్రాంతులకు గురి చేసేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 34%కు తగ్గకుండా ఎన్నికలు చేపట్టాలన్నారు. ప్రస్తుత వైకాపా పాలన వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి పక్షాలను సంప్రదించకుండా ఏకపక్ష ధోరణి ఆలోచనలతో నియంతలా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండా చూడాలని ముఖ్యమంత్రి అంటున్నారని, మరీ ఆయన ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండా అన్ని సీట్లు ఎలా సాధించారన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని పార్టీలతో చర్చించి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం తమ మంత్రులకు కూడా చెప్పకుండా నిర్ణయాలు తీసుకొని అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
'కరోనా భయం లేదని చెప్పిన తర్యాతే ఎన్నికలకు వెళ్లాలి' - cpi ramakrishna latest press meet news
రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పు పట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్లు సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య శాఖ అధికారులు రాష్ట్రంలో కరోనా భయం లేదని కచ్చితంగా వెల్లడించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
!['కరోనా భయం లేదని చెప్పిన తర్యాతే ఎన్నికలకు వెళ్లాలి' గుంతకల్లులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6319620-740-6319620-1583515544487.jpg?imwidth=3840)
కొత్త పంచాయతీ రాజ్ ఆర్డినెన్సు చట్టం ఎన్నికలలో పోటీ చేసే వారిని భయ బ్రాంతులకు గురి చేసేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 34%కు తగ్గకుండా ఎన్నికలు చేపట్టాలన్నారు. ప్రస్తుత వైకాపా పాలన వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి పక్షాలను సంప్రదించకుండా ఏకపక్ష ధోరణి ఆలోచనలతో నియంతలా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండా చూడాలని ముఖ్యమంత్రి అంటున్నారని, మరీ ఆయన ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకుండా అన్ని సీట్లు ఎలా సాధించారన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని పార్టీలతో చర్చించి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం తమ మంత్రులకు కూడా చెప్పకుండా నిర్ణయాలు తీసుకొని అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: 'రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతున్నారు'