14 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రసాయన పరిశ్రమల ఏర్పాటు కోసం అనంతపురం జిల్లా పరిగి, మడకశిర మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన రైతుల నుంచి 2వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు పరిశ్రమేదీ రాలేదు. దీంతో భూములు ఇచ్చిన రైతులు జీవన ఉపాధి కోల్పోయారని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.... ఆ పార్టీ ఆధ్వర్యంలో భూములు ఇచ్చిన రైతులతో కలసి ఆ భూములను దున్ని విత్తనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు.
వెంటనే భూములలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని లేనిపక్షంలో రైతుల భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలని లేనిపక్షంలో రైతుల భూ పోరాట కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: తొలి గాడిద పాల డెయిరీ- లీటరు రూ.7వేలు మాత్రమే!