విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి సమయంలో 3 రెట్లు కరెంట్ బిల్లులు వేయడం సమంజసం కాదన్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు బిల్లు మాఫీతో పాటు, మిగతా వినియోగదారులకు పెంచిన ధరలను తగ్గించాలన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం ఛార్జీలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని హితవు పలికారు. ఏడీఈ షాజహాన్కు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: