అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని గుమ్మగట్ట మండలంలో జరిగింది.
మండలంలోని ఓ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. మంగళవారం 108 ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చి ఓపీలో చేర్పించారు. మద్యాహ్నం వరకు వేచి చూసినా పడకలు ఖాళీ లేవని సిబ్బంది చెప్పడంతో.. ఆమె కుమారుడు స్వగ్రామానికి తీసుకు వచ్చారు. ఊరి శివారులోని ఆమె కూతురు ఇంటి సమీపంలో వదిలేశారు.
కరోనా సోకుతుందేమోనని ఎవరూ ఆమె దగ్గరికి వెళ్లలేదు. కాసేపటికే ఊపిరాడక మృతి చెందింది. గ్రామస్థులే అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొవిడ్ రోగుల బంధువుల ఆందోళన