అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ ఆగటంలేదు. జిల్లా వ్యాప్తంగా సోమవారం 933 మందికి కొత్తగా వైరస్ సోకగా... ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు జిల్లాలో 35, 726 మంది వైరస్ బారిన పడగా... 282 మంది ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం నగరంలో కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. నగరంలో అత్యధికంగా 358 మందికి కొత్తగా వైరస్ సోకింది. ధర్మవరం పట్టణంలో కూడా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టటంలేదు. అక్కడ సోమవారం 71 మంది తాజాగా వైరస్ బారిన పడ్డారు. పామిడిలో 63 మంది, గుత్తి 56 మంది, హిందూపురం 48, పుట్టపర్తి 45, గుంతకల్లు 43, బత్తలపల్లి 36 మందికి కొత్తగా వైరస్ సోకటంతో ఎక్కడిక్కడ ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను, నోడల్ అధికారులు నియమించారు. వైరస్ బాధితుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి ప్రైవేట్ నర్సింగ్ హోంలో చికిత్సలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు