ETV Bharat / state

ఆర్.కొట్టాల గ్రామంలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం ఆర్. కొట్టాల గ్రామంలో ఒకే కుటుంబంలో ఆరుగురితో పాటు వారి ఇంట్లో పని చేసే ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటి వరకు కొట్టాల గ్రామంలో మొత్తం 11 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి.

Corona symptoms in eight people in R. Kottala village
ఆర్.కొట్టాల గ్రామంలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు
author img

By

Published : Jul 14, 2020, 8:13 PM IST

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం ఆర్. కొట్టాల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబంలో వారం వ్యవధిలొనే ముగ్గురు మరణించారు. సందేహించిన వైద్యులు రెండు దఫాలుగా ఆ కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారితో సన్నిహితంగా ఉన్న మరి కొంతమందికీ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 8 మందికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వారిలో ఆరుగురు ఒకే కుటుంబ సభ్యులు కాగా ఇద్దరు వారి ఇంట్లో పని చేసేవారు.

గతంలో వారి కుటుంబ సభ్యుల్లో మరణించిన వారు కూడా కరోనాతోనే మరణించి ఉంటారని వైద్యులు, గ్రామస్థులు భావిస్తున్నారు. అయితే మరణించిన ఆ ముగ్గురి అంత్యక్రియల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది మందికి వైరస్ లక్షణాలు బయటపడడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. హైపోక్లోరైడ్, బ్లీచింగ్ తో శుభ్రం చేస్తున్నారు.

ఇవీ చదవండి: గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.