అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ ఆఫ్ ఇండియా సంస్థలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. సంస్థలో 545 ఉద్యోగులకు నిర్ధరణ పరీక్షలు చేయగా..అందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని ..అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఉద్యోగి...26న అక్కడి నుంచి ఏపీకి వచ్చాడని.... ఉద్యోగి శాంపిల్స్‌ను 27న తీసుకున్నామని తెలియజేశారు. నిర్ధరణ పరీక్షల్లో అతనికి కరోనా వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనిని ఆసుపత్రికి తరలించామని కియా పేర్కొంది. కరోనా అనుమానితులకు పరీక్షలు చేస్తున్నామని... ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండేలా చర్యలు చేపట్టామని యజామాన్యం పేర్కొంది.
ఇదీచూడండి. అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి