ETV Bharat / state

కరోనా కాదు.. 'వివక్ష' చంపేస్తోంది..!

కరోనా సోకిన వారిని నేరుగా వెళ్లి కలిసే వీలుండదు. ఒకరి నుంచి మరొకరికి సోకుతుండటమే ఇందుకు కారణం. అలా అని... ఆ వ్యక్తిని ఒంటరి వాడిని చేయమని కాదు కదా. ఇప్పుడు చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కాస్త ధైర్యం నింపేలా బాధితులతో మాట్లాడే వారే కరవయ్యారు. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తోంది. ఏమీ కాదని..మేమంతా ఉన్నామని..ఈ కష్టం తాత్కాలికమే అని ధైర్యం చెప్పేవారు లేక బాధితులు కుంగిపోతున్నారు. ఇదే వారిలో మానసిక రుగ్మతలకు, నైరాశ్యానికి దారి తీస్తోంది. తమకు తాముగా ఒంటరి అయిపోయామన్న భావనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారితో పాటు వివక్ష ఎదుర్కొని బలవన్మరణం చెందుతున్న వారూ ఉన్నారు.

corona patients sad story
కరోనా కాదు.. 'వివక్ష' చంపేస్తోంది..!
author img

By

Published : Aug 8, 2020, 10:07 PM IST

Updated : Aug 9, 2020, 12:27 AM IST

ఓ 5 నిమిషాలైనా సరే...కరోనా బాధితుడితో ఫోన్‌లో మాట్లాడి...ఏమీ కాదని భరోసా ఇస్తే అంతకు మించిన మందు ఇంకేమీ ఉండదంటున్నారు మానసిక నిపుణులు. కరోనా సోకిన వారిని వివక్షతో చూడొద్దని అవగాహన కల్పిస్తున్నారు. కానీ...క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో కరోనా భయం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది రానురానూ అనేక కుటుంబాల్లో అలజడి రేపుతోంది. మానసిక నిపుణులను సంప్రదించే వారి సంఖ్య మరింత పెరుగుతోంది. దీర్ఘకాలిక రోగాలతో భాధపడుతున్నవారు...ముఖ్యంగా రక్తపోటు ఉన్న వారిలో ఈ తరహా ఒడిదొడుకులు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

తమకూ సోకుతుందేమోనన్న భయంతో

కరోనా సోకినవారే కాదు...ఇరుగు పొరుగు వారూ అదే స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. అసలే కుంగిపోతున్న బాధితులకు చుట్టుపక్కల వారి నుంచి వివక్ష ఎదురవటం ఇంకాస్త కుంగుబాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్నా... ఇంటికి వచ్చేందుకు స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. తమకూ వైరస్ సోకుతుందని... వేరేచోటుకి తరలిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. అద్దె ఇళ్లల్లో ఉన్న వారు తీవ్రంగా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని చెబుతున్నారు. బాధితులు కొందరు ఈ ఇబ్బందులు తట్టుకుంటున్నా కొందరు మాత్రం నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఇలా బతకటం కన్నా చనిపోవటమే మంచిదని బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

కరోనా కాదు.. వివక్ష చంపుతోంది

కొవిడ్‌ బారినపడి కోలుకున్న భార్యాభర్తలు ఇంటికి వచ్చిన తరువాత బంధువులు, ఇరుగు పొరుగు వారు చూపించిన వివక్ష భరించలేక మేడపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని తేరుబజార్‌కు చెందిన ఫణిరాజ్‌, శిరీష దంపతులు కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంటికి వచ్చి తమ కిరాణా దుకాణం తెరిచినా చుట్టుపక్కల వారెవరూ రాకపోవటం వల్ల కలత చెందారు. అటు కొందరు బంధువులూ దూరం పెట్టారు. కుమారుడిని తాతయ్య ఇంటికి పంపించి మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

భయంతో బయటకు చెప్పడంలేదు

వివక్షకు గురవుతామనే భయంతో కొందరు కరోనా లక్షణాలున్నా బయటకు చెప్పకుండా దాచేస్తున్నారు. ఇంటి వైద్యంతో బయటపడవచ్చుననే నమ్మకం... ఏం కాదులేనన్న నిర్లక్ష్యం వెరసి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్యం విషమించి పరిస్థితి చేయి దాటిపోయి ప్రాణాలు కోల్పోతున్నవారూ ఉన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగానే...విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పకపోవడం వల్ల చివరి క్షణంలో... వైద్య సేవలందించినా ప్రాణాలు నిలవటం లేదు. కరోనా ప్రాథమిక లక్షణాలున్నప్పుడే స్పందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మృత్యువాత పడుతున్న వారంతా చివరి దశలో ఆసుపత్రికి వచ్చినవారే. వివక్ష భయం ఇలా ప్రాణాలమీదకు తెస్తోంది.

కరోనా ఫోబియా

కరోనా నుంచి బయటపడే మార్గముందని అందరూ పదేపదే వివరిస్తున్నా చాలా మంది బాధితుల పట్ల కఠినంగా వ్యవహరించటం పరోక్షంగా కరోనా మరణాలు పెరగటానికి కారణమవుతోంది. చెప్పాలంటే..చాలా మందిని కరోనా ఫోబియా వెంటాడుతోంది. కరోనా లక్షణాల్లో ఏ ఒక్కటి తమలో కనిపించినా...భయంతో వణికిపోతున్నారు. పాజిటివ్ వచ్చినా సులువుగా బయటపడతామన్న సానుకూల ధోరణి లోపించటమూ ఈ మరణాలకు కారణమవుతోంది. కేసుల సంఖ్య నానాటికీ పెరగడం ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. చికిత్స పొంది సురక్షితంగా ఇళ్లకు చేరినవారి సంఖ్యే ఎక్కువ. మృతుల సంఖ్య అత్యల్పం. కొందరు మాత్రం అపోహలు పెంచుకుంటున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముందుగా ఆందోళన నుంచి బయట పడాలి. పాజిటివ్‌గా తేలినా అయ్యేదేం లేదన్న వాస్తవం గ్రహించాలి. భయాన్ని వీడితేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని మానసిక వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరోనా గురించి అవగాహన చేసుకుంటే భయం దరి చేరదని చెబుతున్నారు.

ఆరోగ్యవంతులు, కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ వందలో 99 మంది కోలుకుంటున్నారన్న నిజాన్ని మరిచిపోతున్నారు. జాగ్రత్తగా ఉంటే కరోనా దరి చేరదని తెలిసినా.. తనువు చాలిస్తున్నారు. అనవసర భయంతో కుటుంబాన్ని వీధిన పడేస్తున్నారు. తమ దగ్గరికి వచ్చే ప్రతి పదిమందిలో ఆరేడుగురు ఈ భయంతోనే ఉంటున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. అంటే కరోనా ఫోబియా ఎంతగా వెంటాడుతోందో అర్థమవుతోంది. కరోనా బాధితులకు అందించే చికిత్సలో కౌన్సిలింగ్ ప్రక్రియనూ చేర్చితే చాలావరకు ఈ తరహా మరణాలు తగ్గుముఖం పడతాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి...

చేయి విరిగింది.. అయినా ఒంటి చేత్తో వ్యవసాయం చేస్తాడు

Last Updated : Aug 9, 2020, 12:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.