ETV Bharat / state

వైద్యుల కృషి ఫలితం.. అనంతలో జోరుగా కరోనా పరీక్షలు

ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో నమూనాల నిర్ధరణ, ఫలితాల వెల్లడిలో తీవ్ర గందరగోళం సాగేది. ఈనెల 13న జేసీ డిల్లీరావు, 22న కలెక్టర్‌ చంద్రుడు కళాశాలకు వెళ్లి సమీక్షించారు. ఎలా... ఏం చేయాలనే దానిపై సూచనలు చేశారు.

Corona diagnosis testes
అనంతలో జోరుగా కరోనా నిర్ధరణ
author img

By

Published : Apr 28, 2020, 8:54 AM IST

Corona diagnosis testes
అనంతలో జోరుగా కరోనా నిర్ధరణ

ఆమె సర్వజనలో వైద్యురాలు. కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఈమె కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. 14 రోజులు గడిచాక ఆమెకు నెగిటివ్‌ రావడంతో ఇంటికి పంపారు. కుటుంబీకుల నమూనాలు తీసినా ఫలితం ఇప్పటికీ తెలియదు. వారు మాత్రం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

హిందూపురానికి చెందిన వృద్ధుడికి (62) స్థానిక ఆస్పత్రిలోనే నమూనా తీసి ట్రూ నాట్‌ పరికరంలో పరీక్షించారు. నెగిటివ్‌ ఫలితం వచ్చింది. ముందు జాగ్రత్తగా సర్వజనకు తరలించారు. నాలుగు రోజుల కిందట మళ్లీ నమూనా తీశారు. ఫలితం ఏమైందో తెలీదు. ఆ వ్యక్తికి బీపీ తప్ప ఏమీలేవు.

కరోనా.. బాధితులకు చక్కటి వైద్య చికిత్స అందుతోంది. 14 రోజుల చికిత్స పూర్తి కాగానే... తుది ఫలితం మేరకు డిశ్ఛార్జి చేస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తులతో సన్నిహితంగా (కాంటాక్టు) ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. వీరి 14 రోజుల క్వారంటైన్‌ కాలం పూర్తయ్యాక తీసే నమూనాల తుది ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం సాగుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాల, హిందూపురం, కదిరి, బత్తలపల్లి ఆస్పత్రుల ప్రయోగశాలల్లో నమూనాల నిర్ధరణ, ఫలితాల జారీ ఏ రోజుకారోజే, ఎక్కడికక్కడే నిర్దేశిత యంత్రాంగానికి వెళ్తోంది. వీటిని బాధితులకు చేరవేయడంలో జాప్యం అవుతోంది. వెరసి నిర్దేశిత గడువు మీరినా క్వారంటైన్‌ల్లోనే ఉండాల్సి వస్తోంది.

నిర్ధరణలో వేగం:

ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో నమూనాల నిర్ధరణ, ఫలితాల వెల్లడిలో తీవ్ర గందరగోళం సాగేది. ఈనెల 13న జేసీ డిల్లీరావు, 22న కలెక్టర్‌ చంద్రుడు కళాశాలకు వెళ్లి సమీక్షించారు. ఎలా... ఏం చేయాలనే దానిపై సూచనలు చేశారు. ఆ రోజు నుంచి పనితీరు మెరుగైంది. ఏ రోజుకారోజే పక్కాగా నమోదవుతున్నాయి. ఈనెల 19 నుంచి నమూనాలకు జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో ప్రత్యేక ఐడీ వస్తోంది. 22 నుంచి ఇక్కడి కళాశాలలో పక్కాగా కంప్యూటరీకరణ సాగుతోంది. కదిరి, హిందూపురం, బత్తలపల్లిలోనూ ట్రూ నాట్‌ వైద్య పరికరాల ద్వారా నిర్ధరణ ఆశించిన స్థాయిలో నడుస్తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదు

5,079 నమూనాలు: ఇప్పటి దాకా జిల్లాలో 5,079 నమూనాలు తీశారు. ఇందులో 4,982 నమూనాల ఫలితాలు వెల్లడి అయ్యాయి. తక్కినవి పరీక్షల్లో ఉన్నాయి. అయితే... క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల నుంచి తీసిన నమూనాల వ్యవహారం తేలడం లేదు. ఆయా ల్యాబ్‌ల నుంచి ఫలితాలు వెల్లడి కాగానే నేరుగా కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి నిర్దేశిత అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ అధికారులే బాధితులకు తెలియజేయాలి. ఈ ప్రక్రియ పక్కాగా అమలుకాలేదు. పాజిటివ్‌ వ్యక్తులు డిశ్ఛార్జి అయినా, వారి సన్నిహితులను ఇళ్లకు పంపడంలో ఆలస్యం అవుతోంది.

వెంటనే చక్కదిద్దుతాం: ఢిల్లీరావు, జేసీ

నమూనాల సేకరణ, నిర్ధరణ వేగంగా సాగుతోంది. ఇప్పుడు గాడిలో పడ్డాయి. పాజిటివ్‌ వ్యక్తుల సన్నిహితుల నమూనాలు చెప్పడంలో సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తాం. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తాం. ఎవరూ.. ఎక్కడా ఇబ్బందిపడకూడదు. దీనిపై ఆర్డీవో, తహసీల్దార్‌, సంబంధిత అధికారులతో మాట్లాడతాం.

ఇవీ చూడండి...

పరిటాల సునీత.. రాజకీయాలకు భిన్నంగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.