అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం కరోనా వ్యాప్తి నియంత్రణ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించారు. హిందూపురంలో ఎస్పీ సత్య ఏసుబాబు... అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గాంధీ కూడలి వద్ద మాస్క్లు లేకుండా తిరుగుతున్న వాహనచోదకులను, పాద చారులను ఆపి... అనర్థాలను తెలియజేశారు. మాస్క్లు పంచారు. ఈ అవగాహన కార్యక్రమాలను రోజూ జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తామని తెలిపారు. హిందూపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: