అనంతపురం జిల్లా పుట్లూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమేష్ కార్లు అద్దెకు తీసుకుని వాటిని విక్రయించి జూదానికి బానిసై, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ విధంగా 20 మందిని మోసం చేసి... కార్లు కిరాయికి కావాలని వారిని నమ్మించి తీసుకెళ్లి వాటిని వేరే వాళ్లకు విక్రయించి జల్సాలకు పాల్పడ్డాడు. తాను కానిస్టేబుల్ అని బెదిరించి ఆ వాహనాలను ఎంతో కొంత డబ్బులకు అమ్మి... వచ్చిన డబ్బుతో జూదం ఆడేవాడని, కార్ల యజమానులు ప్రశ్నిస్తే వారిని బెదిరించేవాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు రమేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు. రమేష్‌కు కార్లు ఇచ్చి మోసపోయిన వారికి వారి వాహనాలను అందజేస్తామని పుట్లూరు ఎస్సై తెలిపారు. ఇలాంటి మోసపూరితమైన చర్యలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: