సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన నీలకంఠపురం గ్రామంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందిన కొన్ని రోజుల తర్వాత పార్టీ అధిష్టానానికి రఘువీరా రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామాను సమర్పించారు. అప్పటినుంచి ఇప్పటివరకు తన స్వగ్రామంలో దేవాలయ నిర్మాణంలో, వ్యవసాయ పనిలో నిమగ్నమై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారు.
ఇదీ చదవండి: పూర్వ విద్యార్ధుల సమ్మేళనం... గురువులకు సన్మానం..