అనంతపురం రూరల్ రాచనపల్లిలో పోలింగ్ వద్ద వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ వ్యక్తి తనది కాని ఓటును వేయడానికి పోలింగ్ కేంద్రానికి రావడంతో గొడవ మొదలైంది. వైకాపాకు చెందిన వ్యక్తి తన ఓటును ఇదివరకే వినియోగించుకున్నాడు. కానీ మళ్లీ ఓటు వేయడానికి వచ్చాడని కొందరు గుర్తించి అడ్డుకున్నారు.
అయినా.... సదరు వ్యక్తి.. అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడున్న వైకాపా.. తెదేపా కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని వెనక్కి పంపారు.
ఇదీ చదవండి: