ETV Bharat / state

స్థల వివాదం.. వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం

అనంతపురం జిల్లా ప్రసన్నాయన పల్లి గ్రామంలో స్థల విషయంలో వైకాపా నాయకుల మధ్య వివాదం జరిగింది. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువ ప్రవహించే స్థలాన్ని ఒక పక్క చదును చేసి మరో పక్క వదిలివేయటంతో వివాదం చెలరేగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

స్థల విషయంలో వైకాపా నాయకుల మధ్య వివాదం
స్థల విషయంలో వైకాపా నాయకుల మధ్య వివాదం
author img

By

Published : Jun 5, 2020, 12:28 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఓ స్థల ఈ విషయంలో వైకాపా నాయకుల మధ్య వివాదం నెలకొంది. ప్రసన్నాయన పల్లి గ్రామంలో రోడ్డు పక్కన మురుగుకాలువ ఉంది. ఆ కాలువ వెల్లే స్థలాన్ని వేరే వ్యక్తులు ఒక పక్క చదును చేసి... మరో పక్క నిలిపివేశారు. ఫలితంగా మురుగు నీటి ప్రవాహం ఆగిపోయి రహదారిలో పెద్దఎత్తున చెత్త చేరుకుంది. మురుగు నీటితో ఇబ్బంది పడుతున్న స్థానికులు అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో ఇక్కడ కాలువ కొనసాగించాలని కొందరు... కాలువ పడితే తమ స్థలం పోతుందని మరికొంత మంది వైకాపా నాయకులు వాదనకు దిగారు. వివాదం కాస్త పెద్దది కావటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామ పెద్దలతో చర్చింది సర్ది చెప్పారు. నీరు సాఫీగా వెళ్లడానికి తగిన చర్యలు చేపట్టారు. నాయకులు అంటే ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి కానీ ఇలా అభివృద్ధికి ఆటంకం కలిగించకూడదని మరో గ్రూపు వైకాపా నాయకులు విమర్శించారు.

ఇదీ చూడండి: ఏడాదిలో రఘురామ కృష్ణంరాజు, గల్లా జయదేవ్​ టాప్​... ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.