అనంతపురంలో ప్రభుత్వాస్పత్రికి ఎదురుగా ఉన్న గోడ కింద... జీవరత్నం అనే వృద్ధుడు నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నాడు. అతని కాలికి గాయమై నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నాడని ఈటీవీ భారత్.. "నిస్సహాయ స్థితిలో.. సహాయం కోసం ఎదురు చూపులు" అనే శీర్షికన కథనం ప్రచురించడంపై అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నగరపాలక కమిషనర్‌కు ఫోన్ చేసి జీవరత్నంకు ఆసరా కల్పించాలని సూచించారు.
కమిషనర్ పీవీవీఎస్ మూర్తి సాయి... స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు విజయ సాయికి విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే జీవరత్నం ఉండేలా చర్యలు తీసుకున్నారు. అతని కాలి గాయానికి కట్టు కట్టించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అతణ్ని త్వరలో చిత్తూరు జిల్లా అమ్మఒడి ఆశ్రమానికి పంపుతామని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న అతడి పరిస్థితిని ప్రత్యేక కథనంతో తెలిపినందుకు ఈటీవీ భారత్‌ను అభినందించారు.
ఇదీ చదవండి: