చిత్రావతి జలాశయం నిర్వాసితులకు సంబంధించి రూ.50 కోట్ల మొత్తాన్ని.. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. ధర్మవరం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో చిత్రావతి జలాశయ ముంపు నిర్వాసితుల జాబితాలను ఆయన పరిశీలించారు. ఆర్టీవో మధుసూదన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లోని 4 గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం రూ.240 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేసిన అనంతరం ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. సొమ్ము ఇచ్చిన వెంటనే నిర్వాసితులను ఖాళీ చేయించి.. చిత్రావతి జలాశయంలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: