అనంతపురం జిల్లా రాయదుర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించే ప్రాంతాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఈనెల 23న మంత్రి బొత్స సత్యనారాయణ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఆసుపత్రి నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాలలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను 30 పడకల నుంచి 50, 100 పడకల స్థాయికి పెంచే పనులకు, కల్యాణదుర్గంలో అర్బన్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించే పనులకు మంత్రి బొత్స శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం 15 నెలల సమయాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చిందన్నారు.
ఇవీ చదవండి..