ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు నాణ్యమైన చికిత్స అందించాలి'

అనంతపురంలోని కొవిడ్ ఆసుపత్రులను కలెక్టర్‌ గంధం చంద్రుడు పరిశీలించారు. వైద్యచికిత్సలపై రోగులను ఫిర్యాదు... సరైన చికిత్స అందించాలని హెచ్చరించారు.

collector
కలెక్టర్‌ గంధం చంద్రుడు
author img

By

Published : May 15, 2021, 2:06 PM IST

కొవిడ్‌ బాధితులకు అనంతలోని సర్వజన, సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ ఆస్పత్రులే కీలకం. ఇక్కడ నాణ్యమైన వైద్య చికిత్స అందించడం లేదని రోగులు, వారి బంధువులు విమర్శిస్తున్నారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 12న సర్వజనాస్పత్రిలోని పలు వార్డులను ఆయన కలియ తిరిగారు. అంతకుముందు పరిశీలన చేసిన సమయంలో వైద్య చికిత్సపై రోగుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్యుల పనితీరుపై కలెక్టరు హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. సర్వజనలో ప్రసూతి, చిన్నపిల్లల విభాగాలకు సంబంధించి ఓపీ, ఐపీలు ఉన్నాయి. మిగతా విభాగాల్లో కొవిడ్‌ రోగులకే పడకలన్నీ కేటాయించారు. ఆయా విభాగాల హెచ్‌ఓడీలు పూర్తి బాధ్యతగా పని చేయాలి. కానీ కొందరు తూతూమంత్రంగా పని చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు జూనియర్‌ వైద్యులు, నర్సులే బాధితుల వద్దకు వెళుతున్నారు.
1,147 మందికి చికిత్స
మూడు ఆస్పత్రుల్లో మొత్తం 1,147 మంది వైద్య చికిత్స పొందుతున్నారు. ఇందులో ఐసీయూ పడకలపై 118, ఆక్సిజన్‌ పడకలపై 554, సాధారణ పడకలపై 475 మందికి చొప్పున వైద్యం అందిస్తున్నారు. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలపై ఉన్న రోగులకు ప్రత్యేక చికిత్స అందివ్వాలి. నిత్యం నిఘా ఉండాలి. ఆక్సిజన్‌తోపాటు.. రెమ్‌డెసివిర్‌ సూదిమందు ఇవ్వాలి. ఆయాసం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలకు ప్రత్యేక సూది మందు, మాత్రలు అందించాలి. వారి ఆరోగ్య స్థితిపై రోజూ కేసు షీటులో నమోదు చేయాలి. ఇదేదీ సక్రమంగా అమలు కాలేదు.
పర్యవేక్షణ పెరగాలి..
ఆస్పత్రి అధికారులే కాకుండా.. ఆయా విభాగాల హెచ్‌ఓడీల పర్యవేక్షణ మరింత పెరగాలి. వారు కూడా రోగుల వద్దకు వెళ్లి మాట్లాడాలి. కొందరు సీనియర్‌ వైద్యులు వార్డుల్లోకి వెళ్లడం లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. పీజీ, హౌస్‌ సర్జన్లపై భారం మోపినట్లు తెలుస్తోంది. వీరిలోనూ చాలామంది నర్సులపై ఆధారపడి పని చేస్తున్నారు. ఆక్సిజన్‌ పెట్టాలన్నా, ఐసీయూలో వెంటిలేటర్‌ పెట్టాలన్నా ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలపై భారం మోపుతున్నట్లు సమాచారం.
పని విభజన ఏదీ?
సర్వజనాస్పత్రిలో కొవిడ్‌ ఓపీ విధులకు, సూపర్‌స్పెషాలిటీ, క్యాన్సర్‌ ఆస్పత్రులకు సీనియర్‌ వైద్యులకు పని విభజన సరిగా జరగనట్లు తెలుస్తోంది. కొందరిని నియమించినా డుమ్మా కొడుతున్నారు. కొవిడ్‌ ఓపీలో అందరూ జూనియర్‌ ఎంబీబీఎస్‌లే ఉన్నారు. రోగుల విషమ పరిస్థితిని బట్టి వైద్య చికిత్స అందించాలి. ప్రాధాన్యత గుర్తించడంలోనూ బాగా వెనుకపడ్డారు. సూపర్‌ స్పెషాలిటీలో ఎక్కువ మంది దంత వైద్యులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇష్టారీతిన పని విభజన జరగడంతో చికిత్స ఆశించిన మేర లభించడం లేదు.

నిఘా పెంచుతాం
అన్ని విభాగాల్లోనూ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం. తరచూ పర్యవేక్షణ చేస్తున్నాం. మున్ముందు మరింత నిఘా పెంచుతాం. ఆయా విభాగాల హెచ్‌ఓడీలు నిఘా ఉంచారు. కిందిస్థాయి వైద్యులు, సిబ్బందితో పని చేయిస్తున్నారు. ఎక్కడా ఏ సమస్య రాలేదు. - ఆచార్య వెంకటేశ్వరరావు, వైద్య పర్యవేక్షకుడు, సర్వజనాస్పత్రి

ఇదీ చదవండీ.. రైతుకు మంట.. వ్యాపారికి ‘పంట’..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.