ETV Bharat / state

గుప్త నిధులకోసం ఆలయంలో చోరికి యత్నం!

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా కోడిపల్లి గ్రామంలో వెలుగు చూసింది.

గుప్తనిధులకోసం ఆలయంలో చోరికియత్నం
author img

By

Published : Oct 6, 2019, 12:57 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లి గ్రామంలోని శ్రీ కృష్ణ ఆలయంలో గుప్త నిధుల కోసం దుండగలు యత్నించారు. తవ్వకాలు జరిపేందుకు మోటార్ సైకిళ్లపై ఆరుగురు దుండగులు వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. విగ్రహం వెనుక భాగాన పెకిలిస్తుండగా..శబ్దాల దాటికి స్థానికులు కేకలు వేశారు. భయపడిన దుండగులు వెంటనే అక్కడ్నుంచి పరారయ్యారు. ఆలయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవటం నాలుగోసారి అని భక్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

ఆరోగ్యంపై అవగాహన..ఈరోడ్​ యువకుడు సైకిల్​ యాత్ర

Intro:ap_atp_61_06_gutphanidhulakosam_av_ap10005
~~~~~~~~~~~~~~*
గుప్తనిధుల కోసం విఫలయత్నం..
గ్రామస్థుల అప్రమత్తతతో పరారీ...
--------------*
శ్రీకృష్ణుడి ఆలయంలో గుప్తనిధుల కోసం ప్రయత్నించిన దుండగుల ముఠా గ్రామస్థుల అప్రమత్తతతో పరారయ్యారు... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి గ్రామం లోని శ్రీ కృష్ణ ఆలయంలో గుప్త నిధులు వెలికితీసేందుకు మూడో మోటార్సైకిళ్లల్లో ఆరుగురు దుండగులు పనిముట్లు తీసుకువచ్చినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. శ్రీ క్రిష్ణ ఆలయం లో గుప్త నిధుల కోసం విగ్రహం వెనుక భాగాన పెకిలించి వెలికితీసేందుకు ప్రయత్నిస్తుండటంతో శబ్దాలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు కేకలు వేయగా వచ్చిన మోటార్ సైకిళ్లపై పరారైనట్లు వారు తెలుపుతున్నారు. విగ్రహం కింది భాగాన అక్కడక్కడ గాట్లు పడ్డాయి. ఈ ఆలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి అని భక్తులు తెలుపుతూ ఉండగా కళ్యాణదుర్గం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.