ఇవీ చూడండి...
'బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే చెట్లను నరికేశాడు' - chini trees cutting latest news
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో శరత్ కుమార్ రెడ్డికి చెందిన చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. దీంతో కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే చెట్లను నరికేశారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నరికేసిన చీనీ చెట్లు
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో శరత్ కుమార్ రెడ్డి అనే రైతు ఐదు ఎకరాల్లో చీని చెట్లు సాగు చేశాడు. దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు శరత్ కుమార్ పొలంలో 350 చీనీ చెట్లను నరికేశారు. ఎంతో కష్టపడి పెంచిన చెట్లు కాపుకు వచ్చే సమయంలో ఇంతటి ఘోరం చేశారని బాధితుడు వాపోతున్నాడు. వ్యక్తిగతంగా తమ మీద ఎవరికీ కక్షలు లేవని.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
ఇవీ చూడండి...
కదిరి: ఇరువర్గాల మధ్య భూవివాదం