ETV Bharat / state

ఈ- కేవైసీ కోసం అర్ధరాత్రి నుంచి చిన్నపిల్లల పడిగాపులు - అనంతపురం జిల్లా వార్తలు

ఈ- కేవైసీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్‌ కేంద్రాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ పథకాల వర్తింపునకు పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి చేసిన కారణంగా.. అనంతపురం జిల్లాలోని కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచే చిన్నపిల్లలతో ప్రజలు బారులు తీరుతున్నారు.

Children have been waiting in queue
చిన్నపిల్లల పడిగాపులు
author img

By

Published : Aug 19, 2021, 10:10 AM IST

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఆధార్ అప్​డేట్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులంతా ఈ-కేవైసీ నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పిన మేరకు.. ప్రజలు బారులు తీరారు.

పలు ప్రభుత్వ పథకాల కోసం చిన్న పిల్లల ఆధార్ అప్​డేట్ ఉంటేనే లబ్ధి చేరుకుందనటంతో ఆధార్ కేంద్రాల వద్ద చిన్నపిల్లలతో కలసి అర్ధరాతి నుంచే ప్రజలు బారులు తీరారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల నుంచి తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొచ్చి.. మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రహరీ చుట్టూ అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు.

ఇదీ చదవండి:

AADHAR E-KYC : ఆధార్ ఈ-కేవైసీతో పాట్లు... కేంద్రాల వద్ద భారీగా ప్రజల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.