అనంతపురంలో ఐదు నెలల తర్వాత ఓ మోస్తరు వర్షంతో వానదేవుడు కదిరి ప్రాంతాన్ని పలకరించాడు. దీంతో ఆనందంతో చిన్నారులు కేరింతలు కొట్టారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభం నుంచి చినుకు నేల రాలేదు..ముఖం చాటేసిన వరుణుడు కరుణించడంతో రైతులతో పాటు చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు. కరాటే ఆడేందుకు వెళ్లిన పిల్లలు వర్షంలో తడుస్తూ ..నీటిని చల్లుకుంటూ ఆటలు ఆడారు. పిల్లల కేరింతలతో తల్లిదండ్రులు, కరాటే కోచ్లు సంబరపడ్డారు.
ఇదీచూడండి.మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!