అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళపాళ్యం కొండ ప్రాంతాల్లో చిరుతల సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోంది. గత 3 రోజుల నుంచి 2 చిరుతలు గ్రామంలో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పొలాలకు వెళ్లిన గొర్రెల కాపరులు ఒక చిరుతను చూసి పరుగులు తీశారని చెప్పారు. చాలాకాలంగా అవి ఇక్కడే ఉంటున్నాయని.. చిరుతల వల్ల తాము ఆందోళన చెందుతున్నామని గ్రామస్థులు వాపోయారు.
గత నెలలో ఇవే చిరుతలు ప్యాపిలి గ్రామ సమీపంలో ఉన్నాయని.. అవే ఇక్కడకు వచ్చాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వారంపాటు వాటి కదలికలను గమనించి అవే అక్కడే ఉంటే బోన్ ఏర్పాటు చేసి బంధిస్తామని వివరించారు.
ఇవీ చదవండి....
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి