అనంతపురం జిల్లా తాడిపత్రిలో కరోనాతో మృతి చెందిన వృద్ధురాలికి లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్ట్, టిప్పుసుల్తాన్ యునైటెడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాడిపత్రికి చెందిన 55 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె మనవడు కరోనా బారిన పడ్డారు. వృద్ధురాలు మృతి చెందింది. అయితే అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
వృద్ధురాలి మనవడు స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు.. లైఫ్ వరల్డ్ చారిటబుల్ ట్రస్ట్, టిప్పుసుల్తాన్ యునైటెడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వారి సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు చేయని పక్షంలో తమకు తెలియజేస్తే ముందుండి వారి అంత్యక్రియలు నిర్వహిస్తామని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయం.. కొత్తగా 8,943 పాజిటివ్ కేసులు