మద్యంపై జె-ట్యాక్స్
నరేగా పథకం పనులకు కేంద్రం ఇచ్చిన డబ్బులు మూడు రోజుల్లో విడుదల చేయాలని.. లేదా 12శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జె-ట్యాక్స్ విధించి మద్యం ధరలు పెంచి, తాగుబోతులను కూడా వదలకుండా జలగల్లా పీలుస్తున్నరంటూ ఆక్షేపించారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
గ్రామసచివాలయాలు పెద్ద గోల్మాల్
వలంటీర్లు, గ్రామ సచివాలయ నియామకాలన్నీ పెద్ద గోల్ మాల్ అన్న చంద్రబాబు... లక్షలాది చిరుద్యోగులను వేధింపులకు గురిచేసి అన్యాయంగా తొలగించారని విమర్శించారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడంపై మానవహక్కుల కమిషన్, కేంద్రహోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
అప్పు ఇచ్చే వాళ్లు వెనక్కి పోయే దుస్థితి
రాష్ట్రానికి అప్పు ఇచ్చేవాళ్లు కూడా వెనక్కి పోయే దుస్థితి తెచ్చారన్న చంద్రబాబు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ ఇందుకు ఉదాహరణ అన్నారు. గత ప్రభుత్వాలిచ్చిన హామీలను గౌరవించకపోవడం వల్లే, రాష్ట్రానికి ఇప్పుడీ పరిస్థితి దాపరించిందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :