అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహ నిర్బంధాన్ని, అరెస్టులను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 'కియా పరిశ్రమకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కారును పోలీసులు వెంబడించి మరీ... ఆయనను అరెస్టు చేయడం ఏమిటి? ఆయనేమైనా నేరస్థుడా? అనంతపురం జిల్లాలో సీపీఐ నేతల గృహ నిర్బంధాన్ని, అరెస్టులను ఖండిస్తున్నాను. కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే. కియా తమిళనాడుకు తరలిపోతుందని వార్త రావడం, ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైకాపా నేతలు ఇది నిజం కాదని చెప్పించడం. మరుసటి రోజే తాము రాసింది నిజమే అంటూ ఆ జాతీయ మీడియా చెప్పడం... ఏమిటివన్నీ? తెరవెనుక జరిగింది ఏమిటి? కియా సంస్థను ఎవరు బెదిరించారు? ఎవరు వేధించారు? వార్తల్లో నిజా నిజాలేమిటి? ప్రజలకు తెలియొద్దా? వాస్తవాలను నిర్ధరించుకోడానికి వెళ్తున్న నేతలను అరెస్టు చేశారంటే... ఇందులో ప్రభుత్వం దాస్తున్న అంశాలేమిటి? ప్రభుత్వం వెంటనే సీపీఐ నేతలను విడుదల చేయాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: