ETV Bharat / state

కొవిడ్​పై అవగాహనకు కొవ్వొత్తుల ర్యాలీ - candle rally news

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ​​ఎన్ఫోర్స్​మెంట్ అధికారులు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. కరోనా నుంచి తమను తామే రక్షించుకోవాలంటూ అవగాహన కల్పించారు.

candle rally
కొవిడ్​పై అవగాహనకు కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Oct 31, 2020, 9:24 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు విధిగా కరోనా నిబంధలను పాటించాలని​ ఎన్ఫోర్స్​మెంట్ అధికారులు చెప్పారు. పట్టణంలోని మునిసిపాలిటీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు ర్యాలీ సాగింది. నో మాస్క్ -నో ఎంట్రీ అంటూ నినాదాలు చేశారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్​ అవగాహనకు ర్యాలీ నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. దీనివల్ల తమను తాము వైరస్​ నుంచి కాపాడుకోవటమే కాక..ఇతరులను కూడా రక్షించిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయం, పోలీస్ సిబ్బంది, మెప్మా అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పరిహారం ఇచ్చిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేయించాలి: పరిటాల సునీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.