ETV Bharat / state

రద్దీ దృష్ట్యా బస్సు సర్వీసులు పెంపు : కదిరి డిపో మేనేజరు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులు నడుపుతున్నట్లు అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ డిపో మేనేజరు తెలిపారు. అనంతపురం, మదనపల్లి, కొత్త చెరువు, హిందూపురం, రాయచోటి, తలుపుల, పులివెందులకు కదిరి నుంచి బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా రద్దైన సర్వీసులకు టికెట్​ డబ్బులను ఈ నెల 29 లోగా నగదు చెల్లిస్తామని పేర్కొన్నారు.

రద్దీ దృష్ట్యా బస్సు సర్వీసులు పెంపు : కదిరి డిపో మేనేజరు
రద్దీ దృష్ట్యా బస్సు సర్వీసులు పెంపు : కదిరి డిపో మేనేజరు
author img

By

Published : Jul 20, 2020, 12:29 PM IST

ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు నడుపుతామని అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ డిపో మేనేజరు తెలిపారు. కదిరి నుంచి అనంతపురానికి ఉదయం 5.20 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రతి 40 నిమిషాలకు ఒక ఎక్స్ ప్రెస్... మదనపల్లికి, కొత్తచెరువు, హిందూపురానికి ప్రతి 40 నిమిషాలకు ఒక పల్లెవెలుగు బస్సు... రాయచోటికి ప్రతి గంటకి, తలుపుల, పులివెందులకు ప్రతి 30 నిమిషాలకు ఓ పల్లెవెలుగు బస్సు నడుపుతున్నట్లు చెప్పారు.

ప్రతి సర్వీసుకు ఆన్లైన్ టికెట్ల సౌకర్యం ఉందని, రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతున్నట్లు డిపో మేనేజరు చెప్పారు. విజయవాడ, తిరుపతికి సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 19 మధ్య రద్దైన సర్వీసుల రిజర్వేషన్ నగదు తిరిగి చెల్లిస్తామన్నారు. వీరంతా.. ఈ నెల 29లోగా డిపో కౌంటర్ లో లేక ఏ ఇతర ఏటీబీ ఏజెంట్ వద్దనైనా డబ్బులు వాపసు తీసుకోవచ్చని డిపో మేనేజరు చెప్పారు.

ఇదీ చదవండి : విమర్శలు చేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమిలేదు..: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.