ETV Bharat / state

బస్సుల్లోని డీజిల్ చోరీ.. వ్యక్తి అరెస్ట్ - డీజిల్ దొంగ అరెస్టు

కాదేది చోరీకి అనర్హం అన్నట్టు తయారయ్యారు దొంగలు. ఓ ప్రబుద్ధుడు ఏకంగా బస్సు ఇంధనం ట్యాంక్​కే కన్నం వేసి సొమ్ముచేసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతని నుంచి 300 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. వీడేక్కడి దొంగరా బాబు..! అని అనిపించే ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

bus diesel thief arrested in Anantapur
దొంగ అరెస్ట్
author img

By

Published : Oct 9, 2020, 7:49 PM IST

అనంతపురంలో నిలిపి ఉన్న బస్సుల నుంచి ఇంధనాన్ని చోరీ చేస్తున్న వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అనంతపురం రూరల్, ఇటుకలపల్లికి చెందిన చంద్ర.. రాత్రివేళల్లో బస్సు ఇంధన ట్యాంక్ నుంచి డీజిల్​ను దొంగిలించేవాడు. దాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేవాడు. ఓ బస్సు డ్రైవర్​కు అనుమానం రావడంతో, పోలీసులకు విషయం వివరించాడు. వాళ్లు చాకచక్యంగా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 300 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి..: ఏపీఎన్జీవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.