అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం కొత్త పూలోళ్లపల్లిలో బీటెక్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్యకు పాల్పడింది. అశ్విని పుట్టపర్తిలోని ఓ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
కుటుంబ సభ్యులు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లోనే ఉన్న అశ్విని ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గుర్తించిన సోదరి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకుని.. ఆమెను కిందకు దించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందింది .పండగకు ఇంటికి వచ్చిన బిడ్డ శాశ్వతంగా దూరమైందంటూ తల్లిదండ్రులు రామచంద్ర, గంగాదేవి బోరున విలపించారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను మనస్తాపంతో చనిపోతున్నానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని రాసుకున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి