కార్యాలయంలో ఉద్యోగుల ధర్నా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 3 రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ వ్యాప్త సమ్మెబాట పట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పరిధిలో మొదినాబాద్ కార్యాలయంలో ధర్నా చేశారు. ప్రభుత్వ సంస్థలను పట్టించుకోకుండా ప్రైవేట్ టెలికాం సంస్థలకు అనుమతులిచ్చి ప్రభుత్వం నష్టపోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల 1.70 లక్షల కుటుంబాల భవిష్యత్తు బజారున పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.