ETV Bharat / state

అబ్బురపరుస్తున్న బొమ్మల కొలువు.. - గజేంద్ర మోక్షం

Bommala Koluvu: దసరా సంబరాల్లో పిల్లలకు ఆనందం పంచేది బొమ్మల కొలువు. మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణ, భాగవతాలను తెలియచెప్పే ఈ వేడుకలో విజ్ఞానమూ కలగలసి ఉంది. సమాజంలో వస్తున్న మార్పులు తెలియచెప్పేలా అనంతపురంలోని ఓ కుటుంబం 30 ఏళ్లుగా ఈ బొమ్మల కొలువు నిర్వహిస్తోంది. బొమ్మల కొలువును వైజ్ఞానిక ప్రదర్శనగా నిర్వహించడం ఆ కుటుంబం ప్రత్యేకత.

Bommala Koluvu
బొమ్మల కొలువు
author img

By

Published : Oct 4, 2022, 9:12 AM IST

Updated : Oct 4, 2022, 12:20 PM IST

Bommala Koluvu in Anantapur: దసరా పండుగలో దుర్గాపూజతో పాటు మరో ముఖ్యమైన అంశం బొమ్మల కొలువు. ఇవి నేటి తరం పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను తెలియచెబుతాయి. అనంతపురంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కుటుంబం 30 ఏళ్లుగా బొమ్మల కొలువును నిర్వహిస్తోంది. ఒక్కో ఏడాది ఓ ప్రత్యేకతతో విజ్ఞానం అందించేలా ఈ కొలువు ఉంటోంది. ఈ సారి పిల్లల కోసం అనేక అంశాలను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు.

అబ్బురపరుస్తున్న బొమ్మల కొలువు..

"గత ముప్పై సంవత్సరాలుగా దసరాకు బొమ్మల కొలువు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం తమిళనాడు సుబ్రమణ్యస్వామి ఆరు పుణ్యక్షేత్రాలను బొమ్మల కొలువులో ఏర్పాటు చేశాము. చిన్నారులు కోసమే ప్రత్యేకంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. ఎందుకంటే వారు ఎక్కువగా టీవీలు చూస్తు గడుపుతుంటారు. అందువల్ల వారికి పురణాల గురించి సరిగా తెలియటం లేదు. చిన్న పిల్లలకు అర్థమయ్యే తీరులో బొమ్మల ద్వారా కథలు చెప్తుంటాము". - మల్లిక బొమ్మల కొలువు నిర్వహకురాలు

ఈ బొమ్మల కొలువులో మైసూర్ ప్యాలెస్‌ దసరా పండుగ ఉత్సవాలు, తమిళనాడు సుబ్రమణ్యస్వామి ఆలయాల సమాచారం, గజేంద్ర మోక్షం, దశావతరాలతో పాటు అనేక అంశాలను పొందుపరిచారు. కుంభకర్ణుడి నిద్ర వంటి పురాణ అంశాలను సులభంగా అర్థం చేసుకునేలా బొమ్మలను అమర్చారు. 30 ఏళ్లుగా సేకరించిన బొమ్మలతో ఆ ఇల్లు చిన్నారులకు విజ్ఞానాన్ని పంచుతోంది. రోజూ అనేక మంది చిన్నారులను పిలిపించి, వారితో పాటలు పాడించి, బహుమతి ఇచ్చి పంపుతున్నారు. పిల్లల నుంచి మంచి స్పందన ఉండటంతో ఈనెల పదో తేదీ వరకు బొమ్మల కొలువు కొనసాగించాలని నిర్ణయించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 4, 2022, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.