ETV Bharat / state

'కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది'

author img

By

Published : Dec 29, 2019, 7:25 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్​ఆర్సీపై స్పష్టత ఇచ్చేందుకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దియోధర్  అనంతపురంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను కావాలనే అయోమయానికి గురిచేస్తుందని ఆయన ఆరోపించారు.

BJP National secretary speech about CAA NRC
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా సంకల్పించింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ దియోధర్ అనంతపురం జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. పొరుగు దేశాల్లో మతహింసను తట్టుకోలేక భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పిస్తున్నామని దియోధర్ పేర్కొన్నారు. ఎవరి పౌరసత్వాన్ని తీసుకోవటంలేదని ఆయన తెలిపారు. ఈ చట్టంపై కాంగ్రెస్, వామపక్షాలు ప్రజలను అయోమానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. కావాలనే సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం రాష్ట్ర రాజధానిపై స్పందించిన ఆయన... తెదేపా, వైకాపా రాష్ట్ర ప్రయోజనాలకోసం కాకుండా తమ సొంత లాభాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.

ఇదీ చూడండి

తెలుగును ఉపాధి భాషగా పరిగణించాలి'

Intro:అనంతపురం జిల్లా
కంట్రిబ్యూటర్ :- పి . రాజేష్ కుమార్
అనంతపురం టౌన్
ఈజేఎస్ :- సందీప్ వర్మ

slug :- Ap_Atp_11_29_bjp_press_meet_Avb_AP10001

Body:ATP :- బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సి, సిఏబి బిల్లు స్పష్టమైన అంశాలను దేశ ప్రజలు గమనించాలని బిజెపి జాతీయ కార్యదర్శి, ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ దియోధర్ చెప్పారు. అనంతపురంలో కార్యకర్తల సమావేశానికి వచ్చిన ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వివరించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు మతప్రాతిపదికన ఏర్పడ్డాయి. అక్కడ ఉన్న మైనార్టీలు హింసకు గురవుతున్నారని మతం మారాలి అంటూ వారిపై ఒత్తిడి తెస్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని అలాంటి వాళ్లు మన దేశం లోకి రావడానికి ఈ బిల్లు సహకరిస్తుందని తెలిపారు. ఎవరు పడితే వాళ్ళు రావటానికి ఇది ధర్మశాల కాదని వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం భారతదేశంలో అన్ని మతాలకు సమాన అవకాశం కల్పిస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్నారు. రాజధాని తరలించకుండా అక్కడ జరిగిన అవినీతిని బయట పెట్టాలని వైకాపా ప్రభుత్వానికి సూచించారు. తేదేపా, వైకాపా రెండు కుటుంబ పార్టీలని, అవినీతి పార్టీలని విమర్శించారు.

బైట్..... సునీల్ దియోధర్, బిజెపి జాతీయ కార్యదర్శి.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.