అనంతపురం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా ఆలయాలను తొలగిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ భాజపా నేతలు, హిందూ ధార్మిక మండలి ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. నగరంలో 500 ఏళ్ల క్రితం నిర్మించిన తుమ్మల మారెమ్మ గుడిని కూల్చరాదంటూ నిరసన చేశారు. ఈ ఆందోళనకు మద్దుతు తెలిపిన భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు.., ప్రభుత్వం హిందూ ప్రార్థనా మందిరాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
లక్షల మంది ఇలవేల్పుని కూల్చేస్తున్నారు
అనంతపురం నగరంలో రోడ్డు విస్తరణకు రెండు వేర్వేరు మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు అడ్డుగా ఉన్నాయని, వీటిలో హిందూ ఆలయాన్ని మాత్రమే కూల్చాలని నిర్ణయించారని ఆరోపించారు. నగరంలో ఐదు వందల ఏళ్లనాటి తుమ్ముల మారెమ్మ ఆలయం లక్షల మంది ప్రజలు ఇలవేల్పని ఆయన అన్నారు. ఈ ఆలయాన్ని కూల్చాలని చూస్తే ఎట్టిపరిస్థితిలో ఊరుకునేది లేదని శ్రీనివాసులు హెచ్చిరించారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం హిందూ మత ప్రార్థనా మందిరాల విషయంలోనే వివక్ష చూపుతోందని హిందూ ధార్మిక మండలి ప్రతినిధి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: