ETV Bharat / state

దేవాలయాలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించండి: భాజపా

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం భాజపా నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు.

bjp demand government for punishment to temple attacks culprits
భాజపా నాయకులు
author img

By

Published : Sep 19, 2020, 4:23 PM IST

రాష్ట్రంలో హిందూ ఆలయాల్లో వరుస దాడులు జరుగుతున్నాయని.. ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బట్టువానిపల్లి గ్రామ శివార్లలో శుక్రవారం దుండగులు ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ప్రాంతాన్ని ఆర్డీఓ రామ్మోహన్, డీఎస్పీ వెంకటరమణ, తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జి ఉమామహేశ్వర నాయుడు, భాజపా నాయకులు పరిశీలించారు.

అనంతరం భాజపా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దేవాలయాల్లో నిత్యం ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతున్నాయని.. ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే ఈ ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు. వెంటనే ఇటువంటి విధ్వంసాలకు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని లేకుంటే.. తాము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

'హిందూ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.