కర్ప్యూ వేళ అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్డు పక్కన పండ్లు, పూలు అమ్ముకునే వారిని, పాలడైయిరీలను మూసివేయించిన పోలీసులు.. మద్యం దుకాణాలు తెరిచేందుకు ఎలా అనుమతించారంటూ నిరసన చేపట్టారు. మద్యం దుకాణాల వద్ద ఆందోళన చేపట్టి మూసివేయించారు. వైన్స్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటున్నారని.. వాళ్ల ద్వారా కరోనా వ్యాపించదా అంటూ దుకాణ నిర్వాహకులను ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న కదిరి అర్బన్ సీఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని.. భాజపా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ సమయంలో రోడ్ల మీదకు ఎలా వస్తారని.. కేసు నమోదు చేస్తానంటూ హెచ్చరించారు. భాజపా నాయకులు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదీ చదవండి:
మద్యం దుకాణాలు మూసివేయాలంటూ భాజపా నాయకుల నిరసన
అనంతపురం జిల్లా కదిరిలో పండ్లు, పూలు అమ్ముకునే దుకాణాలను, పాలడైయిరీలను మూసివేయించిన పోలీసులు.. మద్యం దుకాణాలు తెరిచేందుకు ఎలా అనుమతించారంటూ భాజపా నాయకులు నిరసన చేపట్టారు.