BEARS: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని రోషన్ వలికొండ - ముదిగల్లు గ్రామాల మధ్య గత మూడు రోజుల నుంచి ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతున్నాయి. ముదిగల్లు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో వాటి సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు.
కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని మారేంపల్లి కాలనీ దగ్గర ఉన్న రోషన్ కొండపై వన్నూరుస్వామి ఉర్సూ ప్రారంభం అవుతున్న తరుణంలో ఎలుగుబంట్ల సంచారం ఆందోళన కలిగిస్తోంది. హిందు- ముస్లింలు కలిసి జరుపుకునే ఉర్సూకు వేలాది మంది భక్తులు రానున్నారు. అయితే తాజాగా అదే కొండపై సుమారు 10 ఎలుగుబంట్లు సంచరించడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఉర్సూకు వచ్చే భక్తులు భయాందోళనలకు లోనవ్వకుండా.. వాటి దాడుల నుంచి రక్షించాలని అటవీ శాఖ అధికారులను స్థానిక ప్రజలు కోరారు. అయితే దీనిపై స్పందించిన జిల్లా అటవీ అధికారులు అక్కడక్కడ రెండు బోన్లు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: