అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లి గ్రామ శివారుల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గొర్రెల మందపై ఎలుగుబంటి దాడికి యత్నించగా..కాపరులు గట్టిగా కేకలు వేస్తూ సమీప పొదల్లోకి తరిమికొట్టారు. ఎలుగుబంటి సంచారం విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటి బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి
RAPE CASE: ఏలూరులో హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు నమోదు