అనంతపురం జిల్లా తలుపుల బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం తనిఖీల్లో బయటపడింది. ఆ శాఖ అధికారి యుగంధర్ వసతి గృహాన్నిఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం వసతి గృహంలో 120మంది విద్యార్థులుండగా ... కేవలం17 మంది విద్యార్థులు మాత్రమే గృహానికి వచ్చారు. సిబ్బంది సైతం అందుబాటులో లేరు. అంతేగాక.. రికార్డులు ఉన్న గదికి తాళం వేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: