అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించబడ్డ డాక్టర్ నళినికి, వివిధ కార్పొరేషన్లలో ఎన్నికైన 13 మంది డైరెక్టర్లకు ఎమ్మెల్యే తిప్పేస్వామి ఘనంగా సన్మానం నిర్వహించారు. ముందుగా పట్టణంలోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎన్నికైన ఛైర్మన్‌కు, డైరెక్టర్లకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి పూలతో సత్కరించారు.
రాష్ట్రానికి మారుమూల ఉన్న మడకశిర ప్రాంతంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తూ.. వీటితోపాటు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 13 మంది డైరెక్టర్లను నియమించి ఈ ప్రాంతం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజలకు నిజాయితీగా సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి: నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం