మడకశిర పట్టణంలో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు ఏఈవో సుబ్రహ్మణ్యం, ఆశ్రాఫ్, శ్రీనివాసులు, రాజశేఖర్లు... వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ నళిని రంగేగౌడ్ను శాలువా, పూలతో సన్మానించారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని కుంచిటిగ వక్కలిగల అభివృద్ధికి కృషి చేస్తానని... అందుకు అధికారులు సహకరించాలని ఛైర్మన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :