ETV Bharat / state

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. - accident to balayya

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు ప్రమాదం తప్పింది. టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రసంగం తర్వాత వాహనం ముందుకు కదలడంతో కిందపడ్డారు.

బాలకృష్ణ
బాలకృష్ణ
author img

By

Published : Jan 26, 2023, 10:05 PM IST

Updated : Jan 26, 2023, 10:36 PM IST

హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణకు ప్రమాదం తప్పింది. టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రసంగం తర్వాత వాహనాన్ని డ్రైవర్ ఒకేసారి ముందుకు కదిలించడంతో బాలయ్య వెనకకు ఒరిగారు. పక్కనే ఉన్నవాళ్లు పట్టుకోవడంతో బాలయ్యకు ప్రమాదం తప్పింది. లేచి నిలబడిన వెంటనే తన పక్కనే ఉన్న వారిని బాలయ్య పరామర్శించడం గమనార్హం.

బాలకృష్ణ

ఇక ఇటీవల బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అక్కినేని వారసులు కూడా స్పందించారు. 'ఎన్టీఆర్ , అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనం కించపర్చుకోవడం అవుతుంది' అని అన్నారు.

అటు ఎస్వీ రంగారావు మనవళ్లు సైతం రెస్పాండ్ అయ్యారు. "నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా మేం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. మేం ఒక కుటుంబంగా ఉంటాం. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారు. ఈ విషయంలో మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగిదీయవద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు" అని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. బాలకృష్ణ తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. బాబాయ్‌(అక్కినేని నాగేశ్వరరావు)పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని ఆయన అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురంలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

"అక్కినేని నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు. అభిమానంతోనే యాధృచ్చికంగా అన్నాను. ఎన్టీఆర్​, ఏఎన్నార్ అలాగే అనేవారు. నేను ఎప్పుడైనా రోడ్డుపై వెళ్తుంటే బాలయ్య వెళ్తున్నాడనే అంటారు. అది అభిమానంతోనే ఫ్యాన్స్​ అలా అంటారు అంతే. ప్రతిమాటకు బాధపడాల్సిన అవసరం లేదు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించాం. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను" అని బాలకృష్ణ అన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jan 26, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.