పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఒడిశాకు చెందిన చింటూ అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడితో పాటు పని చేయడానికి వచ్చిన మరో యువకుడు, ఆటోడ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం చింటూ మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: