ETV Bharat / state

వివాహేతర సంబంధమే... హత్యాయత్నానికి కారణం

author img

By

Published : Mar 18, 2020, 11:05 PM IST

అనంతపురం జిల్లా వెలుగు సీసీ రామ్మోహన్​పై వేట కొడవళ్లతో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. హత్యయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ వెల్లడించారు.

attempt to murder accused arrest
తాడిపత్రిలో హత్యాయత్న నిందితుల అరెస్టు
తాడిపత్రిలో హత్యాయత్న నిందితుల అరెస్టు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఐకేపీ కార్యాలయంలో సీసీ రామ్మోహన్​పై వేట కొడవళ్లతో హత్యాయత్నం చేసిన నిందితులు పోలీసులకు చిక్కారు. దాడికి పాల్పడి పరారీలో ఉన్న నిందితులను 24 గంటల్లోనే తాడిపత్రి పోలీసులు అరెస్టుచేశారు.

అసలు జరిగిందేంటంటే...

వెలుగు ఉద్యోగి రామ్మోహన్​.. ఓ వివాహితతో సంబంధం కొనసాగించేవాడు. ఆమె భర్త లింగారెడ్డి పలుమార్లు రామ్మోహన్​ను హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదని... హత్యకు పథకం పన్నారు. లింగారెడ్డి తన తమ్ముడు రాజారెడ్డితో కలిసి వేట కొడవళ్లతో ఐకేపీ కార్యాలయంలో రామ్మోహన్​పై దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితులు పోలీసులకు చిక్కారు. లింగారెడ్డి, రాజారెడ్డిలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు వేట కొడవళ్లు, కారం పొడి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం నిందితులను రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి: అనంతపురంలో తాగుబోతు వీరంగం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.