ETV Bharat / state

దళితులపై దాడులను అరికట్టాలి...

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని దళితులపై జరిగే దాడులను అరికట్టాలని, రాష్ట్ర సమైక్య సమితి కార్యదర్శి అధ్యక్షుడు విరూప శ్రీనివాసులు డిమాండ్​ చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్టేషన్​లో దళితులకు న్యాయం జరగడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Attacks on Dalits should be curbed
దళితులపై దాడులను అరికట్టాలి
author img

By

Published : Jun 13, 2020, 12:13 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సమైక్య సమితి అధ్యక్షుడు విరూప శ్రీనివాసులు డిమాండ్​ చేశారు. స్థానిక పట్టణంలోని ఆర్​అండ్​బీ అతిథి గృహం వద్ద ఆయన దళిత నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతవారంలో... ఎఫ్ఐఆర్ కాపీ కావాలని గుమ్మగట్ట పోలీస్ స్టేషన్​కి వెళితే, వీరాపురం గ్రామానికి చెందిన సమైక్య సమితి జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డిపై దుర్భాషలాడిన ఘటన సంచలనం రేపిందన్నారు. హెడ్​కానిస్టేబుల్​ రఘనాథ రెడ్డిని వెంటనే సస్పెండ్​ చేసి, కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లో దళితులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సమైక్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్టప్ప, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.