అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో...ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదం కాస్త దాడికి దారి తీసింది. గ్రామంలో నివసించే వడ్డే ఏరిస్వామి, వడ్డే రాజేష్ కుటుంబీకుల మధ్య స్థల వివాదంపై చాలా ఏళ్లుగా మనస్పర్థలు ఉన్నాయి. మంగళవారం నాడు రాజేశ్ తమ ఇంటికి వచ్చి మరీ గొడవపెట్టుకున్నాడని...అనంతరం భర్తపై వేట కొడవలితో దాడి చేశాడని ఏరిస్వామి భార్య తెలిపింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వేట కొడవలితో దాడి...వ్యక్తికి తీవ్ర గాయాలు - వేట కొడవలితో దాడి...వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా అమిద్యాలలో ఇరు కుటుంబీకుల మధ్య జరిగన స్థల వివాదం కారణంగా... ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలయ్యాడు. తమ ఇంటికి వచ్చిమరీ వేటకొడవలితో దాడి చేశాడని బాధితులు తెలిపారు.