అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన నరసప్ప అనే యువకుడిపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని.. బంధువులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనపై పోతలయ్యతో పాటు మరో ముగ్గురు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మూడేళ్ల నుంచి నరసప్ప, పోతలయ్యల మధ్య విభేదాలు ఉన్నాయి. కొంతకాలంగా మదనపల్లిలో నివాసం ఉంటున్న అతను.. స్వగ్రామానికి వచ్చిన విషయం తెలికుని.. తన ప్రత్యర్థులు దాడి చేశారని బాధితుడు వాపోతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
కొడుకు మృతి... కోడలుపై అనుమానం!
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ: సొమ్ములు సమర్పించుకొనే క్విక్ యాప్